ముత్యాలమ్మ గ్రామ దేవతకు బోనాల సమర్పిస్తున్న భక్తులు

ముత్యాలమ్మ గ్రామ దేవతకు బోనాల సమర్పిస్తున్న భక్తులు
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 26 Jul 2026 RMB

ముత్యాలమ్మ గ్రామ దేవతకు బోనాల సమర్పిస్తున్న భక్తులు

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

: తొలి ఏకాదశి పర్వదినం ముగిసిన తరువాత ఆషాఢ మాసాన్ని పురస్కరిం
చుకుని ఆదివారం గ్రామ దేవత ముత్యాలమ్మకు సారే సమర్పించారు. మేజర్ పంచాయతీ రెంటచింతల ఆంజనేయస్వా మి మాణ్యానికి చెందిన భక్తులంతా ఎర్రటి ఎండలో తల్లికి బోనాలు సమర్పించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.ము ఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి చీర, సారె, పసుపు, కుంకుమ అందించారు. కరువు దరి చేరకూ డదని పాడి పంటలతో గ్రామాలు తులతూగాలని వరుణ దేవుడు కరుణించాలని వేడుకున్నారు. చల్లంగ దీవించాలని క రుణ కటాక్షాలు కుమ్మరించాలని ప్రార్ధించారు. పూజారి శ్రిష్టి శ్రీనివాస శర్మ నేతృత్వంలో అమ్మవారికి ప్రత్యేక అలంకా రాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు.

📢 Advertisement Space - Google AdSense