క్రైమ్ - తాజా వార్తలు

పల్నాడు,, విద్యుత్ ఘాతుకానికి ఒకరు మృతి
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 24 Jul 2026 RMB

పల్నాడు,, విద్యుత్ ఘాతుకానికి ఒకరు మృతి

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

మండాది గ్రామం, వెల్దుర్తి మండలం, .జక్కిరెడ్డి అంజిరెడ్డి (వయస్సు 40 సంవత్సరాలు), వృత్తిరీత్యా రైతు.: అడవి పందుల నివారణ కోసం పక్క పొలంలో ఏర్పాటు చేసిన కరెంటు తీగను ప్రమాదవశాత్తూ గురువారం రాత్రి తన స్వంత పొలంలోని ఆటోమేటిక్ మోటార్ స్విచ్ ఆన్ చేయడానికి వెళ్లిన సమయంలో ఈ దారుణ సంఘటన జరిగింది.: కరెంట్ షాక్ తగలడం వల్ల అంజిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి.: ఇదే ప్రమాదంలో మరొక వ్యక్తికి కూడా విద్యుత్ షాక్ తగిలినప్పటికీ, అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.

📢 Advertisement Space - Google AdSense
ట్రాన్స్ఫారంలోని కాపర్ వైరు చోరీ
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 21 Jul 2026 RMB

ట్రాన్స్ఫారంలోని కాపర్ వైరు చోరీ

| 📍 Rentachintala, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

మండలంలోని మంచికల్లు గ్రామానికి చెందిన నెవలి లింగారెడ్డి
పొలంలో వున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ వైర్ అపహరణకు గురైంది. వర్షాలు లేక బోర్ ద్వారా వరి సాగు చేస్తున్నతరు ణంలో చోరీలు జరుగుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రూ.12 వేల వరకు నష్టం సంభవించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున చెప్పారు.

📢 Advertisement Space - Google AdSense
రెంటచింతలో ఇరువురు ఘర్షణ
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 21 Jul 2026 RMB

రెంటచింతలో ఇరువురు ఘర్షణ

| 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్ |

రెంటచింతల,: మాచర్ల-దాచేపల్లి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. గురజాల మండలం సమాధానపేటకు చెందిన నరసింహనాయక్‌కు, రెంటచింతల మండలం గోలికి చెందిన నాగేశ్వరరావు బంధువులకు కాలువ నీటి సరఫరా వ్యవహారంలో వివాదం ఉంది. ఓ రెస్టారెంట్ వద్ద టీ తాగుతూ కాలువ వ్యవహారాలపై చర్చిస్తుండగా వివాదం చెలరేగింది. నరసింహనాయక్ వర్గీయులు దాడి చేయడంతో నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు తలలకు గాయాలయ్యాయి. వారిని గురజాల వైద్యశాలకు తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పరిశీలిస్తున్నారు.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 20 Jul 2026 RMB

ED: భూదాన్ స్కామ్‌లో ఈడీ విచారణకు ఐఏఎస్

| 📍 ఆంధ్రప్రదేశ్ |

భూదాన్ స్కామ్‌లో పొలిటికల్ లింకులు.. ధరణి రిజిస్ట్రేషన్ల అక్రమాలపై దర్యాప్తు

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 20 Jul 2026 RMB

TERROR:పాక్ ఐఎస్ఐతో నిరంతర సంప్రదింపులు

| 📍 ఆంధ్రప్రదేశ్ |

హైదరాబాద్ లో యువకుడి అరెస్ట్

📢 Advertisement Space - Google AdSense
ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి

| 📍 Pendurthi, ఆంధ్రప్రదేశ్ |

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారి గండిగుండం వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anita) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందడం బాధాకరమని తెలిపారు. ఘటనపై విశాఖపట్నం జిల్లా అధికారులను అడిగి హోం మంత్రి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు.

📢 Advertisement Space - Google AdSense
విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం..
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం..

| 📍 Visakhapatnam, ఆంధ్రప్రదేశ్ |

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను వినుకొండ ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ కుటుంబసభ్యులు, బంధువులుగా పోలీసులు గుర్తించారు.ఘటనలో చంద్రశేఖర్‌కు తీవ్రగాయాలు కాగా.. ఆయనను విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇదే ప్రమాదంలో చంద్రశేఖర్ కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. బాధితులంతా గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆనందపురం పోలీసులకు సమాచారం అందించారు.

📢 Advertisement Space - Google AdSense
గోదావరిలో తీవ్ర విషాదం: చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి!
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 18 Jul 2026 RMB

గోదావరిలో తీవ్ర విషాదం: చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి!

| 📍 Polavaram, ఆంధ్రప్రదేశ్ |

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలో గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు స్థానికులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్‌గా అధికారులు గుర్తించారు. ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి, వారికి తక్షణమే అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

📢 Advertisement Space - Google AdSense