విద్య - తాజా వార్తలు

సచివాలయానికి తల్లికి వందనం జాబితా
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 23 Jul 2026 RMB

సచివాలయానికి తల్లికి వందనం జాబితా

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

మండల పరిధిలోని ఆయా స్వర్ణ గ్రామ సచివాలయాల్లో తల్లికి వందనం ఆర్హులు, అనర్హులు జాబితాను
బహిరంగంగా నోటీస్ బోర్డ్లో అతికించినట్లు ఎంఈవో 2 శివనాగేశ్వరరావు చెప్పారు. జాబితాను పరిశీలించి రాని వారుంటే పాఠశాల హెచ్ఎంను సం ప్రదించాలన్నారు. బ్యాంక్ ఖాతా ఆధార్ నెంబర్ సక్రమంగా ఉన్నాయో లేదో ఒకసారి సరి చూసుకోవాలన్నారు. సాంకేతిక కారణాలతో నగదు ఆగిపోతే వెంటనే మీ పరిధిలోని సచివాలయ అధికారులతో సంప్రదించాలన్నారు.

📢 Advertisement Space - Google AdSense
తల్లికి వందనం ఒకే ఇంటికి రూ. 78వేలు
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 23 Jul 2026 RMB

తల్లికి వందనం ఒకే ఇంటికి రూ. 78వేలు

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

AP: ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతున్నా 'తల్లికి వందనం' స్కీమ్ అమలు చేస్తుండటంతో పలు కుటుంబాలు భారీగా లబ్ధి పొందుతున్నాయి. కర్నూలు జిల్లా మాధవరానికి చెందిన ఏలియా, సంగీత దంపతులకు ఆరుగురు సంతానం కాగా రూ.78వేలు అందాయి. నెల్లూరు, పల్నాడు, శ్రీసత్యసాయి ఇలా చాలా జిల్లాల్లో ఐదుగురు పిల్లలు ఉన్నవారికి రూ.65వేలు జమయ్యాయి. ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు రెండో దశలో డబ్బులు అందనున్నాయి.

📢 Advertisement Space - Google AdSense
గాయపడి  చికిత్స పొందుతున్న పికిలిబాయిని పరామర్శిస్తూన ఎమ్మెల్యే
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 20 Jul 2026 RMB

గాయపడి చికిత్స పొందుతున్న పికిలిబాయిని పరామర్శిస్తూన ఎమ్మెల్యే

| 📍 రెంటచింతల, ఆంధ్రప్రదేశ్ |

మండలంలోని తుమ్మకోట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మొగవత్ పికిలిబాయి ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమా దంలో గాయాలపాలై నరసరావుపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పార్టీ నేతల సమాచారం ఇవ్వడంతో నరసరావుపేటలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న పికిలిబాయిని ఎమ్మెల్యే జాలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రాయవరం జంక్షన్ లో రోడ్డు పక్కన నిలబడి వున్న సమయంలో బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో కాళ్లు చేతులకు బలమైన గాయాలయ్యాయని పేర్కొంది. ధైర్యంగా ఉండాలని చెప్పడంతో పాటు వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ గిరిజన నేత మంగ్లానాయక్ తదితరులున్నారు.

📢 Advertisement Space - Google AdSense