మతం మారితే 'ఎస్సీ' హోదా కట్! సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మతం మారితే 'ఎస్సీ' హోదా కట్! సుప్రీంకోర్టు సంచలన తీర్పు
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

మతం మారితే 'ఎస్సీ' హోదా కట్! సుప్రీంకోర్టు సంచలన తీర్పు

| 📍 Delhi, ఢిల్లీ |

హిందూ మతం విడిచి క్రైస్తవం లేదా ఇతర మతాలు స్వీకరించిన వ్యక్తులకు రాజ్యాంగపరమైన ఎస్సీ (SC) హోదా వర్తించదని సుప్రీంకోర్టు తాజాగా తేల్చిచెప్పింది.
ఏపీలోని బాపట్ల జిల్లాలో 2021లో జరిగిన ఒక దాడి కేసుకు సంబంధించి చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదుదారుడు క్రైస్తవ మతం స్వీకరించినందున అతనికి ఈ చట్టం వర్తించదని గతంలో ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పులో ఎలాంటి లోపాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. మతం మారిన తర్వాత ఎస్సీ హోదా, అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందే అవకాశం ఉండదని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైంది.

📢 Advertisement Space - Google AdSense