రైతులకు 9 గంటల విద్యుత్ ఇవ్వడమే లక్ష్యం..! మంత్రి గొట్టిపాటి

రైతులకు 9 గంటల విద్యుత్ ఇవ్వడమే లక్ష్యం..! మంత్రి గొట్టిపాటి

రైతులకు 9 గంటల విద్యుత్ ఇవ్వడమే లక్ష్యం..! మంత్రి గొట్టిపాటి
రైతులకు 9 గంటల విద్యుత్ ఇవ్వడమే లక్ష్యం..! మంత్రి గొట్టిపాటి

రైతులకు 9 గంటలు విద్యుత్తు ఇవ్వడమే లక్ష్యంగా కూటమి పాలన విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ గొట్టిపాటి రవికుమార్ స్వస్తీకరణ సుపరిపాలన తొలి అడుగులో భాగంగా కురిచేడు మండలం కల్లూరు గ్రామంలో సోమవారం 3.80 కోట్లతో చేపట్టిన 33 /11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో గొట్టిపాటి రవికుమార్ గారితో పాటు సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు డోలా బాల వీరాంజనేయ స్వామి దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాజీ శాసనసభ్యులు నారప శెట్టి పాపారావు యువనేత కడియాల లలిత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లు వైసిపి పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నాశనం చేశారని తిరిగి ఏడాదిలో ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పాలనను గాడిలో పెడుతున్నామని ఆయన వివరించారు.

విధ్వంసం నుండి వికాసం వైపు అడుగులు పడుతున్నాయన్నారు ఇందులో భాగంగానే ప్రతి రైతుకు పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్ అందించడం 24 గంటలు గృహ అవసరాలకు విద్యుత్తు అందించడం లక్ష్యంగా విద్యుత్తు రంగంలో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయన్నారు ఇందులో భాగంగానే కురిచేడు మండలంలో లో వోల్టేజి సమస్య నివారణకు కల్లూరు లో నేడు 33 /11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టామని రానున్న నాలుగు నెలల్లో ఈ సబ్ స్టేషన్ పూర్తవుతుందని తత్వారా లో వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు ఇలా విద్యుత్ సమస్య లేకుండా సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నామన్నారు.

ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో సబ్సిడీని కల్పిస్తూ ప్రజలను ప్రోత్సహిస్తున్నామన్నారు అదేవిధంగా రైతుల కోసం 75 వేల మందికి పంపు సీట్లను ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు ఒక్కొక్కరికి రెండున్నర లక్షలు పంపుసెట్లకు విడుదల చేశామని ఆయన వివరించారు ఇలా రైతుల కోసం ప్రజల కోసం మన ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

ఎక్కడ విద్యుత్ సబ్స్టేషన్ ఉంటే అక్కడ సౌరశక్తి కేంద్రాలను ప్రోత్సహిస్తున్నామని తద్వారా ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని ఆయన వివరించారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి లో వోల్టేజి సమస్యపై అడిగిన వెంటనే సబ్స్టేషన్ మంజూరు చేశామని ఆయన వివరించారు.