దర్శి: ఏపీ సీఎం చంద్రబాబు రాక! రైతులకు గుడ్ న్యూస్
దర్శి: ఏపీ సీఎం చంద్రబాబు రాక! రైతులకు గుడ్ న్యూస్
దర్శి లో ఆగస్టు 2న సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు. తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభ కార్యక్రమానికి సీఎం హాజరు. ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా మంత్రులు డోలా, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, డాక్టర్ లక్ష్మీ, అధికారుల బృందం. ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 2వ తేదీ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకటించారు.
దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి రైతుల అకౌంట్లో నగదు జమ చేస్తారని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా రైతుల సంక్షేమం కోసం రైతుల అభివృద్ధి కోసం ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గంలో ప్రారంభించడం ఒక శుభ పరిణామం. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ మనది అభివృద్ధి ప్రభుత్వం, ఇచ్చిన మాట నిలుపుకునే ప్రభుత్వం అని, ఏడాది కూటమి పాలనలో ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు వెళ్లామని ఆయన ప్రకటించారు. అందులో భాగంగానే అన్నదాత సుఖీభవతో 4 విడతలుగా రైతులకు 20వేల రూపాయల నగదు అందజేయడం జరుగుతుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నగదుకు తోడు రాష్ట్ర ప్రభుత్వం మరో 14 వేల రూపాయలు జోడించి ఇవ్వడం జరుగుతుందని, ఇందులో భాగంగా తొలి విడతగా 7000 రూపాయలు నగదు రేపు ఆగస్టు 2వ తేదీన ముఖ్యమంత్రివర్యులు మన దర్శిలో రైతుల అకౌంట్లకు జమ చేయబోతున్నానన్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లను పరిరక్షించేందుకు దర్శి మండలం, తూర్పు వీరాయపాలెం వచ్చామని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, బర్లి పొగాకు కొనుగోలు, మామిడి రైతులను ఆదుకోవడం, ధాన్యం రైతులకు బకాయిలు ఇవ్వడం, ఆయిల్ ఫామ్ రైతులను ఆదుకోవడం, మిర్చి రైతులను ఆదుకోవడం, ఇలా రైతుల కోసం మన కూటమి ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అదే స్ఫూర్తితో అభివృద్ధి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్నామన్నారు.
అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఉత్తమ విద్యా ఫలితాలు వస్తున్నాయని, అది చూసి ఓర్వలేక వైసీపీ అల్లరి మూకలు గురుకుల పాఠశాలలో కండువాలు వేసుకుని వీరంగం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాది కాలంలో 300 కోట్ల రూపాయలను గురుకుల పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేశామన్నారు. అయితే నేడు వైసిపి సైకో మూకలు చేసిన దాడి చాలా బాధాకరమన్నారు. తిరువూరులో, వైజాగ్ లో పాఠశాలలోకి వెళ్లి వీరంగం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రతిపక్షం మంచి సలహాలు ఇవ్వాలి కానీ, యుద్ధం చేసి భయభ్రాంతులు సృష్టించకూడదని ఆయన స్పష్టం చేశారు, అల్లర్లు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
మంచి ప్రభుత్వాన్ని ప్రజల ఆదరిస్తుంటే చూసి ఓర్వలేక ఇలాంటి విధ్వంశాలకు తెగబడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ ఏడాది కూటమి పాలన అద్భుత విజయాల నుండి నేడు సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన అన్నదాత సుఖీభవ అమలు పథకం దర్శి లో ప్రారంభించడం, ఈ ప్రాంత ప్రజానీకం తరఫున ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అవకాశం ఇచ్చిన గౌరవ మంత్రివర్యులు స్వామి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పర్యటనలో పెద్ద ఎత్తున ప్రజానికం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ముఖ్యమంత్రి పర్యటన కోసం బుధవారం మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి యువనేత లలిత్ సాగర్ లు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పట్ల పర్యవేక్షణలో దాదాపు 5 గంటల పాటు హెలిపాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. చివరకు తూర్పు వీరాయపాలెం గ్రామంగా నిర్ణయించి సమీపంలో హెలిపాడ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యువనేత కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి-సుబ్బారావు, పోలీస్, రెవిన్యూ, వ్యవసాయ, మున్సిపల్ శాఖా, తదితర శాఖల అధికారులు వీరితోపాటు ఉన్నారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం లోని మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు ఉన్నారు.