తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు! మెరుపులు, పిడుగులు

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు! మెరుపులు, పిడుగులు

Jun 13, 2025 - 20:25
Jun 13, 2025 - 20:57
 0  45
తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు! మెరుపులు, పిడుగులు
తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు! మెరుపులు, పిడుగులు

తెలుగు రాష్ట్రాలపై తుఫాను ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ హెచ్చరిక. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఉత్తరం వైపు కదిలి, వాయుగుండంగా (Cyclone) బలపడే సంభావ్యత ఉంది. ఈ ప్రభావం వల్ల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, పిడుగుపాటులతో కూడిన తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం: 4 రోజుల పాటు వర్షాల అంచనా భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అల్పపీడనం వల్ల నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు, ఉరుములతో కూడినవిగా ఉండవచ్చు. తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఈ రోజు తెలంగాణలో అధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 33.8°C, కనిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 32°C నమోదయ్యే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల అంచనా ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి, మన్యం, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై శక్తి తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. పిడుగుపాటులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు, ప్రయాణికులు మరియు సాధారణ ప్రజలు ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తెలంగాణ లోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు,టవర్స్,పోల్స్, పొలాలు,బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి. -ఏపీ విపత్తుల సంస్థ

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News