కీలక నిర్ణయం! ఇక నుంచి "Reserve Bank of India"కొత్త రూల్స్

కీలక నిర్ణయం! ఇక నుంచి "Reserve Bank of India"కొత్త రూల్స్

కీలక నిర్ణయం! ఇక నుంచి "Reserve Bank of India"కొత్త రూల్స్
కీలక నిర్ణయం! ఇక నుంచి "Reserve Bank of India"కొత్త రూల్స్

ఆర్బీఐ సంచలన నిర్ణయం. ఆన్‌లైన్ మోసానికి గురైతే బ్యాంకే డబ్బులు ఇస్తుంది. (కీలక నిర్ణయం! ఇక నుంచి "Reserve Bank of India"కొత్త రూల్స్) డిజిటల్ విప్లవం పుణ్యమా అని బ్యాంకింగ్ సేవలు మన అరచేతిలోకి వచ్చేశాయి. కానీ, అదే స్థాయిలో ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి.

అకౌంట్‌లో డబ్బులు మాయమవ్వడం ఒకెత్తయితే, లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు మరొక ఎత్తు. సామాన్య ఖాతాదారుడు ఎదుర్కొంటున్న ఇలాంటి అనేక సమస్యలకు చెక్ పెడుతూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించిన కొత్త ప్రతిపాదనలు బ్యాంకింగ్ రంగం రూపురేఖలను మార్చడమే కాకుండా, ఖాతాదారులకు కొండంత అండగా నిలవనున్నాయి.

ఆన్‌లైన్ మోసం జరిగితే మీ డబ్బులు వెనక్కి డిజిటల్ లావాదేవీల సమయంలో జరిగే చిన్న చిన్న మోసాల వల్ల సామాన్యులు తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. ఇకపై అలాంటి భయం అవసరం లేదు. స్మాల్ వాల్యూ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ ఫ్రేమ్‌వర్క్ కింద, అనాథరైజ్డ్ లావాదేవీలు జరిగితే ఖాతాదారులకు గరిష్టంగా రూ.25,000 వరకు పరిహారం అందించేలా ఆర్‌బీఐ కొత్త నిబంధనలు రూపొందిస్తోంది. అంటే మీ ప్రమేయం లేకుండా మీ ఖాతా నుంచి చిన్న మొత్తంలో డబ్బు మాయమైతే, ఆ నష్టాన్ని బ్యాంకే భరించాల్సి ఉంటుంది.