పొదిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు! తాను చెప్పిందే మార్కెట్ వాల్యూ
పొదిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు! తాను చెప్పిందే మార్కెట్ వాల్యూ
పొదిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా భూముల మార్కెట్ విలువలను పెంచుతూ ప్రతిపాదనలు.
◆దాదాపు "30 శాతం నుంచి 117 శాతం" వరకు పెంచుతూ తీసుకున్న ప్రతిపాదిత సవరించిన భూముల మార్కెట్ ధరల వివరాలతో కూడిన భూముల మార్కెట్ విలువల లిస్టును స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లో అప్లోడ్ చేసిన విషయాన్ని ఫోన్ ద్వారా మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన సీనియర్ జర్నలిస్ట్ సామంతపూడి పరమేశ్వరరావు.
◆ఈ అంశంపై పరిశీలిస్తామని సానుకూలంగా స్పందించిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్.
◆ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో "పొదిలి సబ్ రిజిస్ట్రార్" ఆఫీసు పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న భూముల మార్కెట్ విలువలను 1 శాతం నుండి 10 శాతం లోపు పెంచాల్సి ఉండగా...అందుకు విరుద్ధంగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఉల్లంగించి దాదాపు "30 శాతం నుంచి 117 శాతం" వరకు పెంచుతూ తీసుకున్న ప్రతిపాదిత సవరించిన భూముల మార్కెట్ ధరల వివరాలతో కూడిన భూముల మార్కెట్ విలువల లిస్టును స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లో సైతం ఇప్పటికే అప్లోడ్ చేసిన విషయంపై మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన సీనియర్ జర్నలిస్ట్ సామంతపూడి పరమేశ్వరరావు.
◆పొదిలి నగర పంచాయతీ లోని విశ్వనాధపురం ఏరియా సర్వే నంబర్ 205 లోని పొదిలి రూరల్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ పేరిట 1951 లో చెన్నైలోని చెంగల్పట్టు రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్ చేసిన హక్కు విడుదల డాక్యుమెంట్ లో ఉన్న వారికి చెందిన విలువైన ప్లాట్లను కబ్జా చేసి నిర్మాణం చేసిన ఇంటికి సంబంధించి ఎటువంటి రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్లు లేకుండా ఇటీవల పంచాయతీ అసెస్మెంట్ నంబర్ మరియు విఆర్వో ధ్రువీకరణ పత్రంతో పొదిలి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగిన 4 రిజిస్ట్రేషన్లను ఉన్నతాధికారులు విచారణ జరిపి రద్దు చేయాలి.
◆గతంలో పొదిలి రూరల్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్లాట్లలో ఒకరి పేరుతో రిజిస్ట్రేషన్ ఉన్న ప్లాట్ల ను ఇంకొకరి పేరుతో రిజిస్ట్రేషన్ లు, ఆక్రమణలు జరిగిన వ్యవహారంపై గతంలో అప్పటి ఒంగోలు డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి తోట సాయినాధ్ స్వయంగా విచారణ చేసి దీనిపై 51 ఎంక్వయిరీ వేయడంతో పాటు సదరు ప్లాట్లను రిజిస్ట్రేషన్ లు చేయరాదంటూ పొదిలి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెల్సిందే.
◆ఇందుకు విరుద్ధంగా జరిగిన పొదిలి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇటీవల కాలంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ లపై జిల్లా ఉన్నతాధికారులతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు మరియు ఏపీ లోకాయుక్త లో కూడా ఫిర్యాదులు చేస్తున్నట్లుగా సమాచారం.