తెలుగు రాష్ట్రాలకు శక్తి తుఫాన్ ముప్పు! అతి భారీ వర్షాలు, ఉరుములు

తెలుగు రాష్ట్రాలకు శక్తి తుఫాన్ ముప్పు! అతి భారీ వర్షాలు, ఉరుములు

May 28, 2025 - 22:15
May 28, 2025 - 22:43
 0  36108
తెలుగు రాష్ట్రాలకు శక్తి తుఫాన్ ముప్పు! అతి భారీ వర్షాలు, ఉరుములు
తెలుగు రాష్ట్రాలకు శక్తి తుఫాన్ ముప్పు! అతి భారీ వర్షాలు, ఉరుములు

తెలుగు రాష్ట్రాలకు శక్తి తుఫాన్ ముప్పు! అతి భారీ వర్షాలు, ఉరుములు. బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం కాస్త తీవ్ర శక్తి తుఫానుగా మారి పాలు మరియు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్రాలో పలు ప్రదేశాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.

శక్తి తుఫాన్ గోవా, మహారాష్ట్ర, ఒడిశా మరియు ఇతర రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు మరియు గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో శక్తి తుఫాన్ ప్రభావం భారీ వర్షాలు మరియు ఉప్పెనలకు కారణం కావచ్చు. రాయలసీమలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా.

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై శక్తి తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం దాటి ఉత్తరం వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రెండు రోజుల్లో ఇది శక్తి తుపానుగా మారే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదవుతాయని అధికారులు ప్రకటించారు.

తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, తెలంగాణ పలు జిల్లాలు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు,టవర్స్,పోల్స్, పొలాలు,బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి. -ఏపీ విపత్తుల సంస్థ

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News