కిలాడీ లేడీ! ఎంతో మందిని మోసం చేసి చివరికి
కిలాడీ లేడీ! ఎంతో మందిని మోసం చేసి చివరికి

ఐఏఎస్ అధికారి అంటూ యువకులను నమ్మించి మోసం చేస్తున్న కిలాడి లేడీ అరెస్ట్ డాక్టర్ ప్రత్యూష ఐఏఎస్‌గా చలామణీ అవుతూ యువకులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న కిలాడి లేడీ సరితను అరెస్టు చేసిన పోలీసులు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండాకు చెందిన సరిత అలియాస్ ప్రత్యూష విద్యార్ధిని ముసుగులో హాస్టల్లో ఉంటూ తోటి యువతుల సెల్ ఫోన్లు, నగదు దొంగలించేది కొంతకాలంగా డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ తాను డాక్టర్, ఐఏఎస్, డీఎస్పీ కూతురు అంటూ రకరకాల పదవులను వాడుకొని యువకులను మోసం చేస్తున్న సరిత ఏడాది క్రితం ఒక వైద్యుడిని బెదిరించి రూ.5 లక్షలు వసూలు చేసిన సరిత.
మరో యువకుడిని డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేసిన సరిత మూడు రోజుల క్రితం డైల్ 100 ద్వారా పోలీసులకు ఫోన్ చేసి తాను డీఎస్పీ సతీమణిని అంటూ ఒకసారి, యువతి హత్య జరిగిందని మరోసారి పోలీసులను ఆటపట్టించిన సరిత సరిత పైన చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ టూ టౌన్, మిర్యాలగూడ వన్ టౌన్, నార్కెట్పల్లి, నల్గొండ పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు నమోదు చేసిన పోలీసులు నిన్న ఒక చోరీ కేసులో సరితను అరెస్టు చేయగా, వాస్తవాలు బయటపడడంతో రిమాండ్‌కు తరలించిన పోలీసులు
What's Your Reaction?






