పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ
పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ
రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు గారు అన్నారు నూజండ్ల మండలం కంభంపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగిస్తూ, నూతనంగా రూపొందించిన "మీ భూమి - మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.గతంలో ఉన్న రాజకీయ నేతల చిత్రాలను తొలగించి, కేవలం అధికారిక ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను పంపిణీ చేయడం ద్వారా భూ యజమానులకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని ఆయన తెలిపారు.
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, భూ రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి రైతులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అధికారులు, రెవెన్యూ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.