టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించిన ప్రకాశం జిల్లా పోలీసులు
టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించిన ప్రకాశం జిల్లా పోలీసులు. సంచలన నిజాలు వెల్లడించిన జిల్లా పోలీసులు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వీరయ్య హత్య కేసును చేధించిన ప్రకాశం జిల్లా పోలీసులు. సంచలన హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చిన ప్రకాశం జిల్లా పోలీసులు.
రాత్రింబవళ్లు శ్రమించి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముద్దాయిలను పట్టుకున్న పోలీసు యంత్రాంగం. మర్డర్ కేసును ఛేదించుటలో ప్రతిభ చూపిన పొలిసు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్, ఐపీఎస్. CR.NO.249/2025 U/S 61 (2) 331 (5), 103 (1), 351 (2) 49, 58 r/w 3 (5) BNS of Ongole Taluka Police Station. ది:22-04-2025 రాత్రి సుమారు 07-30 గంటల సమయంలో శశిరేఖ ఏజెన్సీ బిల్డింగ్, 2 వ ఫ్లోర్, సాంబశివ నగర్, 1st Lane, మెయిన్ రోడ్, ఒంగోలు, మృతుడు ముప్పవరపు వీరయ్య చౌదరి చెందిన ఆఫీస్ లో మద్యం shop ల లెక్కలు తమ అకౌంటెంట్స్ లతో చూస్తున్న సమయంలో, నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు scooty మరియు motorcycle పై వచ్చి తన ఆఫీస్ లోనికి ప్రవేశించి, వీరయ్య ను కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి, కేకలు వేసిన అకౌంటెంట్ లను ఆఫీస్ లోని సిబ్బంది ని బెదిరించి, అక్కడనుండి పై తెలిపిన ద్విచక్ర వాహనాలపై Guntur Flyover మీదుగా పారిపోయినారు.
ఈ విషయం పై, వీరయ్య ఆఫీస్ లో పనిచేసే అకౌంటెంట్ అడుసుమల్లి భాస్కర్ రావు s/o సింగరయ్య ఇచ్చిన పిర్యాదు మేరకు, ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నందు Cr.No.249/2025 U/S 61 (2) 331 (5), 103 (1), 351 (2) 49, 58 r/w 3 (5) BNS గా ది.22-04-2025 రాత్రి 21-00 గం. లకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయడమైనది. ఈ రోజు అనగా ది:14-05-2025, 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి, వారివద్ద నుండి 7 మొబైల్ ఫోన్స్ మూడు కత్తులు మరియు ఒక నల్లని చిన్న బాగ్ లను స్వాదినపరచుకోవడమైనది.
అరెస్ట్ కాబడిన ముద్దాయిల పేర్లు మరియు వివరాలు: బోర్లగుంట వినోద్ కుమార్, S/o వెంకటేశ్వర్లు, 32 సం, రాజులు కులం, కొప్పోలు రోడ్, డ్రీమ్స్ స్కూల్ దగ్గర, ఒంగోలు, తువ్వర వంశి కృష్ణ @ జల్సా వంశి S/o వెంకట నరసయ్య, 28 సం, SC మాల కులం, బాలాజీ నగర్, ఎసయ్య కాలనీ, నెల్లూరు, బెల్లంకొండ వెంకట గౌతం, S/o కృష్ణ, 32 సం, విశ్వబ్రాహ్మిన్ కులం, బక్తవత్చల నగర్, కృష్ణ మందిర్ ఎదురు, నెల్లూరు పట్టణం మన్నెం తేజ, @ బన్నీ, S/o మోహన్ బాబు, 21 సం, గౌడ కులం, దామరమడుగు గ్రామం, బుచిరేడ్డిపాలెం మండలం, నెల్లూరు జిల్లా, మార్టూరి కిరణ్ కుమార్, S/o కోటయ్య, 39 సం, రజక కులం, r/o పోచమ్మ టెంపుల్ వెనుక, నేరేడు మిట్ట, హైదరాబాద్, n/o అగ్రహారం గేటు దగ్గర, బాలాజీ నగర్, ఒంగోలు, షేక్ సమీర్, S/o బద్రుద్దీన్, 22 సం, ముస్లిం కులం, r/o 1st లైన్, బలరాం కాలనీ, ఒంగోలు, n/o 1st లైన్, నెహ్రు నగర్, చీమకుర్తి, ఆళ్ళ సాంబశివరావు, @ సాంబయ్య @ సిద్దాంతి S/o అంజయ్య, 61 సం, కమ్మ కులం, అమ్మనబ్రోలు గ్రామం, NG పాడు మండలం వీరగంధం దేవెంద్రనాద్ చౌదరి, S/o వెంకట నాగేశ్వర రావు 30 సం, కమ్మ కులం, అమ్మనబ్రోలు గ్రామం, NG పాడు మండలం, తోటా శ్రీనివాసరావు, S/o వెంకట రాయుడు, 40 సం, బలిజ కులం, దాసరివారి పాలెం, NG పాడు మండలం పరారిలో వున్న ముద్దాయులు: 1.ముప్పా సురేష్, 2.ఓబిలి నాగరాజు, 3.గోళ్ళ రుత్యేంద్ర బాబు @ నాని. నేరం జరిగిన విధానం, అందుకు గల కారణాలు: మృతుడు ముప్పవరపు వీరయ్య చౌదరి NG పాడు మండలం, అమ్మనబ్రోలు గ్రామం, ప్రస్తుతం, ఒంగోలు లోని రాజీవ్ నగర్ లో జనని అపార్ట్ మెంట్ నందు నివాసం. మృతుడు లిక్కర్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ, SN పాడు నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటువుంటాడు. గతంలో, మృతుడు NG పాడు మండలం MPP గా పని చేసినాడు.
అదే గ్రామానికి చెందిన, ముద్దాయులు అయిన ఆళ్ళ సాంబయ్య మరియు ముప్పా సురేష్ అనువారు, వీరయ్య కు అనుకూలంగా వుండి, కాలక్రమేణ గ్రామ విషయాలలో మృతుడు వీరయ్య కు వ్యతిరేకంగా వ్యవహరిస్తువుంటారు. గ్రామంలో ఆధిపత్య పోరు ఏర్పడి, వారిమధ్య మనఃస్పర్దలు పెరిగి, పై తెలిపిన ముద్దాయులు మృతుడికి పై కక్ష పెంచుకొనివున్నారు. ఒక పధకం ప్రకారం మృతుడిని చంపి, గ్రామంలో, మండలం లో, నియోజకవర్గం లో ఎదగాలనే దురుద్దేశ్యంతో, ఆళ్ళ సాంబయ్య మరియు మృతుడు వీరయ్య చౌదరి వలన ఇసుక వ్యాపారంలో నష్టపోయిన వినోద్ ను, తోట శ్రీను ద్వారా కలవడమైనది. వినోద్ కు హైదరాబాద్ లో కొన్ని House Disputes కు సంభందించిన పరిష్కారం కొరకు హైదరాబాద్ కు వెళ్లి ఆళ్ళ సాంబయ్య, వినోద్, తోట శ్రీను లు ముప్పా సురేష్ ను కలిసేవారు.
ఆ విధంగా వినోద్ కు ఆళ్ళ సాంబయ్య, ముప్పా సురేష్ లతో బాగా పరిచయం ఏర్పడినది. ఆ పరిచయంతో వినోద్ కు కొంతమంది నెల్లూరు కు చెందిన రౌడీ షీటర్లతో పరిచయాలు ఉన్నవని తెలుసుకొని, ముప్పా సురేష్ కు చెన్నై కి చెందిన రఘు రామ్ అనే అతను నుండి 9 కోట్ల రూపాయలు బకాయిలు రావలసివుండగా, దాని తాలూకు డబ్బు వసూలు చేయుటకు ఆళ్ళ సాంబయ్య, వినోద్ మరియు కొంతమంది నెల్లూరు కు చెందిన వినోద్ స్నేహితులు చెన్నై లోని రఘు రామ్ ఇంటికి వెళ్లి బెదిరించటం జరిగినది. దానితో, సాంబయ్య కు, సురేష్ కు వినోద్ పై నమ్మకం పెరిగినది. ఆళ్ళ సాంబయ్య కు, ముప్పా సురేష్ కు మృతుడు వీరయ్య తరచూ తన వ్యాపారాలలో మరియు రాజకీయాలలో అడ్డువస్తున్నాడని, అతనిని ఎలాగైనా చంపాలని, అందుకు గాను, ఆళ్ళ సాంబయ్య వినోద్ తో నీవు నాకు ఇవ్వవలసిన 10 లక్షల రూపాయలు, చేబదులుగా ఇచ్చిన మరో 10 లక్షలు రూపాయలు నాకు ఇవ్వవలసి పనిలేదని, హత్య చేపించిన తరువాత పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని చెప్పినాడు.
అందుకు, వినోద్ కూడా వీరయ్య వలన ఇసుక వ్యాపారంలో నష్టపోయి, కక్ష వుండటం తో ఎలాగైనా హత్య చేయిస్తాను అని ఒప్పుకున్నాడు. తరువాత ఒక సందర్భంలో వినోద్, తోట శ్రీను లు GSR హాస్పిటల్ వద్ద దేవెంద్రనాద్ ను కలిసినప్పుడు, వినోద్, దేవెంద్రనాద్ ను పక్కకు తీసుకెళ్ళి ఆళ్ళ సాంబయ్య వీరయ్య పై attack చేయమని అంటున్నాడు అని చెప్పగా, దేవెంద్రనాద్ ఆయన విషయాలు నాకు చెప్పవద్దు, నాకు ఏమి సంభందం లేదు, ఇటువంటి పనులు చేయకండి అని చెప్పి, అప్పటినుండి వినోద్ తో ఫోన్ కాంటాక్ట్ లో లేడు. అంతట వినోద్ నెల్లూరు కు చెందిన, గోళ్ళ రుత్యేంద్ర బాబు @ నాని ను కలిసి, వీరయ్య ను హత్య చేయవలసిన విషయం గురించి తెలియచేసి, ఇద్దరు కలిసి కిరాయి హంతకులు అయిన తువ్వర వంశి కృష్ణ, మన్నెం తేజ @ బన్నీ లను కిరాయి హత్య కొరకు మాట్లాడుకొని, అలాగే వినోద్ కు పరిచయం వున్న బెల్లంకొండ వెంకట గౌతం మరియు గౌతమ్ స్నేహితుడైన నాగరాజు లతో వీరయ్య చౌదరి ని హత్య చేయాలని చెప్పగా, వారు అంగికరించినారు. వారిలో గౌతం మూడు సార్లు, నాగరాజు రెండు సార్లు, తేజ మరియు రుత్యేంద్ర బాబు @ నాని ఒక సారి ఒంగోలు వచ్చి స్థానికంగా వున్న lodge లో కొన్నిరోజులు, Paying Guest Hostel లో కొన్ని రోజులు వుండి వెళ్ళినారు.
ఆ మేరకు గౌతం, నాగరాజులు వచ్చేటప్పుడు వినోద్ సూచన మేరకు వారి వెంట కత్తులను కూడా తీసుకోని వచ్చినారు. పై నలుగురు ఒంగోలు వచ్చిన తరువాత, వారికి వసతి కల్పించడమైనది. వినోద్ వారికి కావలసిన సదుపాయాలను, Splendor Motorcycle ను తన వద్ద పనిచేసే షమీర్ ద్వార సమకూర్చినాడు. వినోద్ కిరాయి హంతకులకు మృతుడు వీరయ్య చౌదరి ఇల్లు మరియు ఆఫీస్ లను చూపించి, ఇంటివద్ద CC కెమెరాలు ఉంటాయి కాబట్టి అతనిని తన ఆఫీస్ లోనే చంపాలని, అతనిని చంపిన తరువాత ఎలా తప్పించుకోవాలి, ఏ రూట్ లో వెళ్ళాలని కూడా రెక్కి చేసి, వీరయ్య చౌదరి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు తోట శ్రీను ద్వారా వినోద్ తెలుసుకొంటు, వీరయ్య హత్య కొరకు అతని సహాయ సహకారాలు తీసుకున్నాడు.
వీరయ్య హత్య జరిగే రోజు అనగా ది:22-04-2025, వీరయ్య ఆఫీస్ కు వచ్చినాడని బూడిద రంగు షర్టు వేసుకొని వున్నారనే విషయం తోట శ్రీను, వినోద్ ద్వారా PG లో వున్న కిరాయి హంతకులకు తెలియచేసినాడు. వినోద్ చెప్పిన మేరకు, అప్పటికే కత్తులు మరియు 10 వేల రూపాయల డబ్బులను scooty డిక్కీ లో పెట్టి వుంచి ఒక ఇంటిముందు పార్క్ చేసిన scooty ని, తోట శ్రీను తీసుకెళ్ళి బులెట్ షోరూం వద్ద పార్క్ చేసి, తాళంను scooty లో పెట్టి, దానిపై వాటర్ బాటిల్ పెట్టినాడు. ఆ విషయం వినోద్ కిరాయి హంతకులకు చెప్పగా, వారిలో గౌతమ్ splendar బైక్ పై, మిగత ముగ్గురు ఆటో లో బొంగుల టీ షాప్ వద్దకు వెళ్లి, అక్కడ, వంశి, బన్ని scooty లో మరియు గౌతమ్, నాగరాజు splendar బైక్ పై వీరయ్య ఆఫీస్ వద్దకు వచ్చి, సుమారు రాత్రి 7-35 గం., సమయంలో, మృతుడు తన ఆఫీస్ లో వుండగా, కిరాయి హంతకులు అయిన వంశి కృష్ణ, మన్నెం తేజ @ బన్నీ, గౌతం మరియు నాగరాజు లు కత్తులతో మృతుడు వీరయ్య ఆఫీస్ లోనికి ప్రవేశించి, మృతుడిని కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి, అడ్డువచ్చిన ఆఫీస్ సిబ్బందిని బెదిరించి, అక్కడ నుండి Hero Honda splendor motorcycle మరియు Suziki Access - 125 scooty లపై పారిపోయినారు. వీరయ్య హత్యకు ముందు, వినోద్ బంధువైన మార్టురి కిరణ్ ఒక సారి ఒంగోలు లోని lodge కి వచ్చి ముద్దాయిలతో వుండి, ప్లాన్ లో పాల్గొని, ఈ హత్య తరువాత, వినోద్ కు షెల్టర్ ఇస్తానని మరియు ఈ కేసులో పాల్గొన్న ముద్దాయిలకు తనకు తెలిసిన అడ్వకేట్ లను మాట్లాడతానని భరోస చెప్పి వెళ్ళినాడు.
దర్యాప్తు లో స్వాదిన పరచుకొన్నవాహనాలు: 1. Splendor Motorcycle bearing No.AP27AC-0649 2. Suzuki Access - 125 Scooty bearing No.AP39HC2628 ముద్దాయిల వద్ద నుండి స్వాదిన పరచుకొన్న వస్తువులు: 1. Mobile Phones - 7 2. One black colour bag and three knives, ప్రకాశం జిల్లా SP శ్రీ. A.R. దామోదర్, IPS., గారి ఆదేశాల ప్రకారం, ఒంగోలు DSP శ్రీ. R. శ్రీనివాస రావు గారు దర్యాప్తు చేపట్టి, పై కేసును చేదించుటకు CIs – ఒంగోలు తాలూకా PS, మహిళా PS, చీమకుర్తి PS, CI–CCS, CI-Traffic మరియు ఇతర సిబ్బంది కొన్ని బృందాలుగా ఏర్పాటుచేసి, పై కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, ముద్దాయులు వదిలి వెళ్ళిన Suzuki Access - 125 Scooty ని మరియు Hero Honda splendor motorcycle లను పొలిసు వారు గుర్తించి, స్కూటీ లో వున్న పేపర్స్ ఆధారంగా, ముద్దాయిలను గుర్తించి, వారికోసం పోలీస్ బృందాలు గాలిస్తున్న సమయంలో, రాబడిన సమాచారం మేరకు, ఈ రోజు DSP గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పై తెలిపిన ముద్దాయిలు 1) బోర్లగుంట వినోద్ కుమార్ 2) తువ్వర వంశి కృష్ణ @ జల్సా వంశి 3) బెల్లంకొండ వెంకట గౌతం, 4) మన్నెం తేజ, @ బన్నీ, 5) మార్టూరి కిరణ్ కుమార్ 6) షేక్ సమీర్, 7) ఆళ్ళ సాంబశివరావు, @ సాంబయ్య, 8) వీరగంధం దేవెంద్రనాద్ చౌదరి మరియు 9) తోటా శ్రీనివాసరావు లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 7 ఫోన్ లు మరియు 3 కత్తులు స్వాదినపరుచుకోవడమైనది.
అభినందన: ఈ కేసులో పాల్గొన్న, ఒంగోలు DSP శ్రీ. R. శ్రీనివాస రావు, CIs - ఒంగోలు తాలూకా PS, మహిళా PS, చీమకుర్తి PS, CI-CCS, CI-Traffic, CI-IT Core, ఒంగోలు, CI- మర్కాపూర్, CI ఒంగోలు రూరల్, CI- వై. పాలెం, SIs- ముండ్లమూరు, జరుగుమల్లి, SN పాడు, పెద్దారవీడు, మద్దిపాడు, కోతపట్నం, మర్కాపూర్ రూరల్, దోర్నాల, SI- సందీప్, ఒంగోలు తాలూకా, RSI Malyadri, Traffic, ఇంకా మరికొంతమంది అధికారులు మరియు సిబ్బందిని ప్రకాశం జిల్లా SP శ్రీ. A.R. దామోదర్, IPS., గారు ప్రత్యేకముగా అభినందించారు.