కడపలో మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
కడపలో మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
ఈనెల 27, 28, 29న కడపలో నిర్వహించే మహానాడు ఏర్పాట్లను ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు శనివారం పరిశీలించారు. బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్న జీవి గారు మహానాడు ఏర్పాటు పనులపై కడప టిడిపి నాయకులతో కలిసి సమీక్షించారు. అనంతరం పులివెందుల చేరుకున్నా ఆయన టిడిపి కార్యాలయంలో పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవితో పాటు ముఖ్య నాయకులతో కలిసి జన సమీకరణ తదితర ఏర్పాట్లపై సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు. #Mahanadu2025 #TeluguDesamParty