వివాదంలో ఇరుక్కున్న ఎక్సైజ్ సీఐ హసీనా భాను!

వివాదంలో ఇరుక్కున్న ఎక్సైజ్ సీఐ హసీనా భాను!

వివాదంలో ఇరుక్కున్న ఎక్సైజ్ సీఐ హసీనా భాను!
వివాదంలో ఇరుక్కున్న ఎక్సైజ్ సీఐ హసీనా భాను!

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ వివాదంలో చిక్కుకున్నారు.. ఆమె ఆఫీస్‌బాయ్‌పై చెప్పుతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. 'మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి నీవు డబ్బులు వసూలు చేసుకొని నాపై చెబుతావా నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తావా' కళ్యాణదుర్గం ఎక్సైజ్‌ సీఐ హసీనాభాను ఆఫీస్‌ బాయ్‌ని చెప్పుతో కొట్టారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన బయటపడింది. కొంతకాలంగా తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని హాసీనాభాను చెబుతున్నారు. ఈ క్రమంలో అటెండర్‌తో సీఐకి వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి సీఐ అటెండర్‌ను చెప్పుతో కొట్టారు. అయితే అటెండర్ మాత్రం తనకు ఏం తెలియదు అంటున్నారు.