అరేబియా సముద్రం లో భారీ అల్పపీడనం! విస్తారంగా వర్షాలు
అరేబియా సముద్రం లో భారీ అల్పపీడనం! విస్తారంగా వర్షాలు

(అరేబియా సముద్రం లో భారీ అల్పపీడనం! విస్తారంగా వర్షాలు) తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తగ్గుముఖం పట్టాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కడుతున్నాయి.ఇంకా తెలుగు రాష్ట్రాల్లో శక్తి తుఫాన్ పోకముందే మరో భారీ అల్పపీడనం అరేబియా సముద్రం లో ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుచి అతి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తాయి. ఉత్తర కర్ణాటక-గోవా తీరంలో తూర్పు-మధ్య అరేబియా సముద్రంపై అల్పపీడనం ఏర్పడింది. తరువాత ఉత్తర దిశగా కదులుతున్న అల్పపీడనం రాబోయే 36 గంటల్లో తీవ్ర అల్పపీడనం గా బలపడే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది.
ఉపరితల ఆవర్తనాల శక్తి తుఫాన్ ప్రభావంతో రానున్న రోజుల్లో కోస్తా కర్ణాటక, కేరళ, మాహే, దక్షిణ ఒడిశా, కర్ణాటకలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని గంటకు 50 నుంచి 60 కిమీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు,టవర్స్,పోల్స్, పొలాలు,బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి. -ఏపీ విపత్తుల సంస్థ
What's Your Reaction?






